29 C
Hyderabad
Monday, August 3, 2026

6వ వార్డు నామినేషన్ దాఖలు చేసిన హఫీజా బేగం.

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : 

 

బాన్సువాడ పట్టణంలోని 6వ వార్డు  కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హఫీజా బేగం శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా హఫీజా బేగం మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ పోచారం భాస్కర్ రెడ్డి, తనపై నమ్మకం ఉంచి ఒక్క అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.6వ వార్డు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.వార్డు అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలియజేస్తూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని వార్డు ప్రజలను కోరారు.

More articles

Latest article