బతుకమ్మ, మాక్లూర్ : మాక్లూర్ మండలంలోని కల్లెడి గ్రామంలో గల ఆరోగ్య కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పిహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ ప్రకాష్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. మహనీయుడు డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కరు ఈ రోజు స్వేచ్ఛ స్వభావలతో సమసమాజ నిర్మాణం లో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో కల్లెడి పీహెచ్ సీ సిబ్బంది పాల్గొన్నారు.
