సూర్యాపేట, బతుకమ్మ: సూర్యాపేట జిల్లాలోని గొల్లగట్టు జాతరలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెకు స్థానికులతోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. లింగమంతుల స్వామివారితోపాటు చౌడమ్మ తల్లికి ఆమె బోనం సమర్పించారు. తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు తెలిపిన ఆమె.. స్వామివారికి బోనం చెల్లిండం తన అదృష్టంగా భావిస్తున్నాని పేర్కొన్నారు. సముక్క సారక్క జాతర తరువాత రెండో అతి పెద్ద జాతర లింగమంతుల జాతర అని అన్నారు. కేసీఆర్ హయాంలో జాతరకు రూ.14 కోట్ల నిధులు కేటాయించామని, ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నామన్నారు. కవిత వెంట మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్ రెడ్డి , మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ , మేడే రాజీవ్ సాగర్ తదితరులు ఉన్నారు.
