24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రుద్రూర్ లో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతి నిధులు కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్, పార్వతి ప్రవీణ్, ఇందూర్ కార్తీక్, మాజీ జడ్పీటీసీ నారోజీ గంగారాం, వడ్ల నరేశ్, కుర్మాజీ సాయిలు, షేక్ నిస్సార్, అడప సాయిలు, కర్క అశోక్, తోట సంగయ్య, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

More articles

Latest article