బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు కేంద్రంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కర్రోల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజు మాట్లాడుతూ గతంలో అప్పటి సర్పంచ్ నాగభూషణం స్థానిక పితిరి వాగు పక్కన ఎకరా స్థలం స్మశాన వాటిక కోసం కేటాయించారు ఇప్పటికీ కూడా అంతక్రియలు జరుపుతున్నారు కానీ ఆ భూమిని వెంచర్ పేరుతో ఆ భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాటికొండ స్వామి సురేష్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నారు.
