లింగంపేట్, బతుకమ్మ :
లింగంపేట్ మండలం నల్లమడుగు పెద్ద తండా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాన్యం తరలిస్తున్న లారీ బోల్తా పడ్డట్లు తండావాసులు తెలిపారు. మండలంలోని జల్దిపిల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో నుండి ధాన్యం తీసుకుని నల్లమడుగు పెద్ద తండా మీదుగా గాంధారి వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తాండవాసులు తెలిపారు. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో అదుపు తప్పి లారీ బోల్తా పడ్డట్లు తండావాసులు తెలిపారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.

