బిచ్కుంద అబ్కారీ సీఐ సత్యనారాయణ
బిచ్కుంద, బతుకమ్మ : జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గౌడ కులస్తులు ఈతవనాలు పెంచి ప్రజలకు స్వచ్ఛమైన కల్లును అందించేందుకు కృషి చేయాలని బిచ్కుంద ఆబ్కారీ సీఐ సత్యనారాయణ సూచించారు. వన మహోత్సవంలో భాగంగా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామంలో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో గౌడ కులస్తుల తో కలిసి ఈత మొక్కలను నాటారు. అన్ని గ్రామాలలో గౌడ కులస్తులు ముందుకు వచ్చి ఈత మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని చెప్పారు. భవిష్యత్తులో ఈత చెట్ల నుంచి తీసిన స్వచ్ఛమైన కల్లును ప్రజలకు అందించి ఆరోగ్యవంతులుగా చేయాలని గుర్తు చేశారు. కల్తీకల్లును నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ఆబ్కారీ ఎస్సై నాగేష్, గ్రామస్తులు గంగా గౌడ్, శంకర్ గౌడ్, నరేష్ గౌడ్, గోపాల్ రెడ్డి, సాయిలు, రాములు, వెంకట్ తదితరులు ఉన్నారు.

