23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

దళారులకు అమ్మిన ధాన్యానికి కూడా ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కెసీయర్ చెప్పినట్లే రైతుబందుకు రాం రాం అయ్యింది
  • రైతులకు అడగకుండానే అన్ని ఇచ్చిన నేత కేసీఅరే
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

భీమ్ గల్, బతుకమ్మ : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం కారణంగా, వాతావరణం అనుకూలంగా లేకపోగా రైతులు దాన్యాంను దళారులకు అమ్ముకుంటున్నారని, వారికి కుడా ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ ను ఇవ్వాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమ్మర్ పల్లి మండల కేంద్రం తో పాటు మండలంలోని కొనసముందర్ పీఏసీసీఎస్ ల గోడౌన్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోర్టల్ లో నమోదు చేసిన లెక్కన ప్రయివేట్ కు ప్రభుత్వానికి అమ్ముకొన్న అందరికి బోనస్ ను ఇవ్వాలన్నారు. రైతులకు ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మార్పు అని అన్ని అబద్దలను చెప్పి గద్దెనెక్కి రైతులను మోసం చేసిందని అన్నారు. ఋణమాఫీ అని 100 రోజులని, పంద్రాగస్టు అని దసరా, దీపావళి అని రుణమాఫీ ఇంతవరకు చెయ్యలేదని, కోర్రిలను పెడుతోందని దుయ్యబట్టారు. రైతు భరోసా 5 వేలు పెంచి ఇస్తామని చెప్పి, పార్లమెంట్ ఎన్నికల వేల ఒక దఫా పాత పద్ధతిన రైతుబందు వేసి ఇక రైతుబంధుకు రాం రాం చెప్పారని ఏద్దేవా చేశారు. మెనూఫెస్టోలో అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడేమో సన్నపు వడ్లకు మాత్రమేణాని అంటున్నారని అన్నారు. ఆ ఇస్తానన్న సన్నవడ్ల బోనస్ ను ప్రభుత్వం ఎగ్గొట్టెందుకు గాను కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ కావాలని ఆపుతున్నరన్నారు. కొనుగోలు ఆలస్యం చేస్తే రైతు వాళ్లకు వాళ్లే ప్రయివేట్ వాళ్లకు అమ్ముకోవాలనే ఉద్దేశం తోనే ఇప్పటికి వరకు అలాట్మెంట్లు ఇవ్వలేదని, కొనుగోలు ప్రారంభించలేదన్నారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభిస్తే సరిపోదని రైతులకు బోనస్ తో పాటు వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. గత బీయర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొమ్మిదెండ్ల పాటు టంచన్ గా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి,రైతుబందు ను రైతు ఖాతాల్లో వెయ్యడం రైతులు చూశారని గుర్తు చేశారు. రైతులు అడగక ముందే రైతులకు ఏదికావాలో ఆలోచించి ఎలాంటి కోర్రిలు లేకుండా అన్నింటిని రైతులకు అనుకూలంగా చేసి పెట్టిన ఘనత కెసీఆర్ సార్ దేనని ఆయన అన్నారు. ఇప్పటికి ఎమ్మెల్యేగా తనకు ప్రభుత్వ నిధులు ఏమి రాలేదని కమ్మర్ పల్లి, కొనసముందర్ సొసైటీలకు గోడౌన్ల నిర్మాణంకు నిధులు కావాలని రైతు నన్ను అడగగా నేను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావును నిధుల విషయం అడగగా అడిగిందే తడవు రెండు సొసైటీలకు గోడౌన్ ల నిర్మాణం కు రూ. 10 లక్షల చొప్పున రూ. 20 లక్షలు ఇచ్చారని తెలిపారు. నిధులు లేని సమయంలో అడగగానే నిధులు ఇచ్చిన సంతోష్ రావు కు కమ్మర్ పల్లి, కొనసముందర్ సొసైటీ పాలకవర్గాలు, రైతుల తరపున ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, పీఏసీసీఎస్ చైర్మన్లు దేవేందర్,ప్రతాప్,
ప్మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుచ్చన్న రాజాగౌడ్,బద్దం చిన్నారెడ్డి,గడ్డం స్వామి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article