24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్, గృహజ్యోతి పథకం, మహాలక్ష్మి పథకం, ఓల్డ్ ఏజ్ పెన్షన్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్స్ తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండలంలో ని దొనకల్, శెట్ పల్లీ, ధర్మోరా గ్రామాల్లో బుధవారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి  తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరడం జరిగింది. కార్యక్రమంలో మోర్తాడ్ మండలం నాయకులు వై శ్రీ, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ రెడ్డి, సుంకేట్ గంగ నరసయ్య, శెట్పల్లి గ్రామ అధ్యక్షులు లక్మ రంజిత్, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు మనోజ్, ఆనంద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article