29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంజనీరింగ్ కాలేజీగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం  పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజిగా అప్గ్రేడ్ చేయాలని 2022 సంవత్సరం నుండి నేటి వరకు పీడీఎస్యూ వరుసగా ఆందోళన కార్యక్రమాలు చేసిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి ఇంజనీరింగ్ కాలేజి అనేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థుల ఆకాంక్ష అని తెలిపారన్నారు. ఉమ్మడి నిజామబాద్ జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులకు ఉపయోగకరమని పీడీఎస్యూ  ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఫలితంగా ప్రభుత్వం నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీ గా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పడడం ద్వారా నిజామబాద్ జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేద విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందుతుందన్నారు. ఇది పీడీఎస్యూ నాయకత్వంలో పోరాడిన పాలిటెక్నిక్ విద్యార్థుల విజయం అని తెలిపారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ అప్గ్రేడ్ చేయడానికి కృషిచేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి ధన్యవాదాలు తెలిపారు. వెంటనే ఇంజనీరింగ్ కాలేజ్ అప్గ్రేడ్ సంబంధించిన నిధులను విడుదల చేసి, ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల పీడీఎస్యూ విద్యార్థి నాయకులు శ్రీకాంత్,మహేష్,తరుణ్,కోహ్లీ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article