ఇంజనీరింగ్ కాలేజీగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజిగా అప్గ్రేడ్ చేయాలని 2022 సంవత్సరం నుండి నేటి వరకు పీడీఎస్యూ వరుసగా ఆందోళన కార్యక్రమాలు చేసిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి ఇంజనీరింగ్ కాలేజి అనేది...