నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి

  . . . జిల్లా వ్యవసాయ శాఖ అధికారి   లింగంపేట్, బతుకమ్మ   వర్షాకాలంలో పంటలు సాగు చేస్తున్న రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎరువులు విత్తనాలు విక్రయ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని ఎరువుల నిల్వలు, విక్రయ రిజిస్టర్లు, లైసెన్సులు బిల్లుల నిర్వహణ పరిశీలించారు. అధిక ధరలకు కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని వ్యాపారులకు సూచించారు....