తెయూ ఆంగ్ల విభాగంలో గోల్డి బల్బీర్ కౌర్ కు డాక్టరేట్ ప్రదానం

0 15,426

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పరిశోధక విద్యార్థి గోల్డిబల్వీర్ కౌర్ తన పరిశోధనను కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ వి శ్రీనివాస్  పర్యవేక్షణలో  ‘ద ఇమేజ్ ఆఫ్ న్యూ వుమెన్ స్టడీ ఆఫ్ శోభడీ సెలక్ట్ నావెల్స్’ అనే అంశంపై పూర్తి చేసింది. మంగళవారం జరిగిన మౌఖిక పరీక్షకు  ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ జి.తిరుపతి కుమార్ ఆన్లైన్లో హాజరయ్యారు. ప్రొఫెసర్ జి తిరుపతి పరిశోధకురాలు  గోల్ది బల్బీర్ పరిశోధించి  విశ్వవిద్యాలయానికి  సమర్పించిన సిద్ధాంత గ్రంథంలో అభ్యుదయ స్త్రీవాదం, లింగ సమానత్వం, కుటుంబా ఆర్థిక రాజకీయ స్వావలంబన పై  సమగ్రంగా విశ్లేషణ ఉందని ఇది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకురాలను అభినందించారు.   ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు డీన్ ప్రొఫెసర్ లావణ్య, విభాగాధిపతి డాక్టర్ కెవి రమణ చారి, చైర్ పర్సన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డాక్టర్, పి సమత, డాక్టర్ ఎల్ జోష్నా, డాక్టర్ ఎన్ స్వామి రావు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.