26.8 C
Hyderabad

బోధన్‌లో బంగారు షాపుల దోపిడీ కేసు ఛేదన

Must read

📰 Generate e-Paper Clip

. . . పరారీలో ఉన్న మరో నిందితుడి అరెస్టు

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణ పరిధిలో గత నెల జరిగిన బంగారు దుకాణాల దోపిడీ ఘటనలో పరారీలో ఉన్న మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 21న అర్ధరాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ఉమ్రి గ్రామానికి చెందిన మహమ్మద్ మౌలాసాబ్ షేక్‌ను బోధన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు నగలు, 1 కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన బోధన్ ఎస్‌హెచ్‌ఓ వి. వెంకట నారాయణ, ఎస్సై బి. మనోజ్ కుమార్, ఏఎస్ఐ బాబురావు, సిబ్బంది కె. రవి, మహేష్, ఎ. సాయి కుమార్‌లను, కేసు దర్యాప్తులో సహకారం అందించిన కొండల్‌వాడి, ఉమ్రి పోలీస్ శాఖల అధికారులను నిజామాబాద్ నగర పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ దుకాణాల భద్రతకు ప్రతి దుకాణ సముదాయం ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article