యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ

0 8,143

యాదగిరిగుట్ట, బతుకమ్మ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు. కార్తిక మాసం మొదటి రోజు, స్వామి వారి జన్మనక్షత్రం రోజు కావడంతో ఆలయంలో 108 కలశాలతో శత ఘటాభిషేక పూజలు చేశారు.  పంచామతాలు, శుద్ధజలంతో స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. అంతకు ముందు గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఇందులో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు.  సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జన్మనక్షత్రం స్వాతి సందర్బంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఈకార్యక్రమాన్ని రంగంపేట పీఠాధిపతి మాధవనంద సరస్వతి ప్రారంభించారు. భారీగా భక్తులు పాల్గొన్నారు.Giri Pradakshina in Yadagirigutta

 

 

 

Leave A Reply

Your email address will not be published.