యాదగిరిగుట్ట, బతుకమ్మ : యాదగిరి గుట్ట క్షేత్రంలో ఆదివారం నరసింహ స్వామి జయంతి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ ఈవో వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో గోమాత, జాతీయ పతాకాలను భక్తులు చేతబూని జయ జయధ్వానాలు చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.