నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు జీ.వీ.శ్యాంప్రసాద్ లాల్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను శనివారం సందర్శించారు. మోస్రా, చందూర్, వర్ని సత్యనారాయణపురం, బోధన్ మండలం సంగెం గ్రామ పంచాయతీలలో కొనసాగిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నామపత్రాలు స్వీకరిస్తున్న తీరును గమనించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియ జరుగుతోందా అని నిశిత పరిశీలన చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు. అబ్జర్వర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

