- తృటిలో తప్పిన ప్రమాదం
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : నగరంలోని మార్కెట్ కమిటీ వద్ద శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సమయంలో మనుషులు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తోపాటు ఆస్తి నష్టం కూడా తప్పింది. కార్యాలయం వెనుక వైపు పెద్ద ఎత్తున చెత్తకుప్పలు పేరుకుపోయాయి. సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగడంతో స్థానిక కార్పొరేటర్ వెంటనే అగ్గిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పెద్ద ఎత్తున పొగలు రావడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రతిరోజు మార్కెట్లో పేరుకపోయే చెత్త సరిగా శుభ్రం చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే మార్కెట్ యార్డ్ లోనే చెత్త పేరుకుపోయి అగ్ని ప్రమాదం సంభవించిన తరుణంలో శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది.