26.3 C
Hyderabad
Monday, August 3, 2026

యూరప్ పర్యటనలో గణేష్ బిగాల, మహేష్ బిగాల

Must read

📰 Generate e-Paper Clip

 

. . . లండన్‌లో లార్డ్ ఉదయ్ నాగరాజుతో సమావేశం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

యూరప్ పర్యటనలో భాగంగా లండన్‌లో పర్యటిస్తున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల బ్రిటిష్ పార్లమెంట్‌లో ఇటీవల లార్డ్ (ఎంపీ) హోదాకు ఎంపికైన ఉదయ్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లార్డ్ ఉదయ్ నాగరాజుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నూతన బాధ్యతల స్వీకరణకు అభినందనలు తెలిపారు. తెలుగు సమాజానికి చెందిన వ్యక్తి బ్రిటిష్ పార్లమెంట్‌లో లార్డ్ హోదాను అలంకరించడం అత్యంత అరుదైన విషయం అని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని గణేష్ బిగాల, మహేష్ బిగాల పేర్కొన్నారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనను ప్రత్యక్షంగా కలిసి అభినందించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. బ్రిటన్‌లో తెలుగు సమాజం మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఇలాంటి విజయాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగగా, పలు అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.

More articles

Latest article