నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.యాదగిరిరావుని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి, యూనివర్సిటీ సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై చర్చించారు. వీరితోపాటు నిజామాబాద్ అర్బన్ ఎస్టీ సెల్ అధ్యక్షులు సుభాష్, డిచ్పల్లి మండల ఏఐబీబీఎస్ఎస్ జనరల్ సెక్రటరీ సుధాకర్, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ యువజన ఉపాధ్యక్షులు ఇర్ఫాన్ పాల్గొన్నారు.

