నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా , సమతా సైనిక్ దళ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రామినేర్ శిభిరంను తెలంగాణ రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ సందర్శించారు. గురువారం నగరంలోని బుద్ధవిహార్ లో జరుగుతున్న శిభిరంలో అంబేధ్కర్ విగ్రహం కు గడుగు గంగాధర్పులమాలలు వేసి .నివాళ్లర్పించారుఈ పవిత్ర శిబిరానికి భంతే బుద్ధ ఘోష్ థేరో ,భంతే నాగభూషణం, భంతే సాగర బోధి,భంతే నాగ వజ్ర, భిక్కుణి ఖే మాజీ వారు ధమ్మ మార్గంలో స్ఫూర్తిని అందిస్తున్నారు. బౌద్ధుల చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వమైన మహా బోధి మహా విహార్ విముక్తి కోసం ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ, బౌద్ధుల హక్కుల సాధనకు కృషి చేద్దాం అని గడుగు గంగాధర్ పిలుపు నిచ్చారు. సమతా సైనిక్ దళ్ శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో క్రమశిక్షణ, సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం అనే ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం అన్నారు. బౌద్ధ వారసత్వ పరిరక్షణకు సంకల్పం, ఇది సమతా సైనిక్ దళ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రేరణ అన్నారు. మహా బోధి మహా విహార్ విముక్తి ఉద్యమం విజయవంతం కావాలి, సమతా సైనిక్ దళ్ ఆశయాలు ప్రతి ఇంటికి చేరాలి అని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డా పులి జైపాల్, బిఎస్ఐ ఉపాధ్యక్షులు అశోక్ భాగ్యవాన్, మల్లనీ శివ, శ్రీధర్, సిద్ధు భాగ్య వన్ సుదర్శన్ తదితరులు హాజరయ్య

