29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

వికలాంగుల సంక్షేమానికి నిధులను పెంచాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి నిధులను పెంచాలని, వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకు పెంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. వికలాంగుల జాతీయ హక్కుల వేదిక (ఎన్ పిఆర్ డి) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అంజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు పూర్తయిందని, తమ పెన్షన్ పెంపుదల కొరకు 42 లక్షల మంది పైగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులను పెంచాలని, కొత్త పెన్షన్ ల కోసం 24 లక్షల 85 వేల మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని, వారికి పెన్షన్ మంజూరు చేయడం లేదని వాపోయారు. అదేవిధంగా సహాయ పరికరాల కోసం లబ్ధిదారుల ఎంపిక జరిగి సంవత్సరం పూర్తి అవుతున్న ఇప్పటికీ అందరికీ పరికరాలను పంపిణీ చేయలేదని ఆయనన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చడం వలన ఇప్పటివరకు పని చేస్తున్న వికలాంగుల ఉపాధి పైన తీవ్ర ప్రభావం పడుతుందని, అందువల్ల ఆ చట్టాన్ని యధాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను అమలు జరపాలని అన్నారు. లేని యెడల తమ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో పోరాటాన్ని ఉదృతం చేయాల్సి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు గైని రాములు, కోశాధికారి రాములు పటేల్, జిల్లా నాయకులు షేక్ నజీర్, రామచంద్రరావు, వినోద్, సాయిలు, లక్ష్మి, భాను, లింగం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article