28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రకృతి వ్యవసాయానికి పూర్తి సహకారం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సర్పంచ్ దిగడం విజయ్ కుమార్

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

శెట్ పల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించేందుకు గ్రామపంచాయతీ పూర్తి సహకారం అందిస్తుందని సర్పంచ్ దిగడం విజయకుమార్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, జీవామృతం, బీజామృతం తయారీ విధానం, మల్చింగ్ పద్ధతులు, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే మార్గాలు, నేల ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతులను అనుసరించడం మంచిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు చురుకుగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

More articles

Latest article