మోటాట్ పల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని మొటాట్ పల్లి గ్రామంలో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అందరూ ఈ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆవులు గేదెలు ఏవైనా కట్టనిచో వాటిని పరీక్షించి గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్స అందించడం జరిగింది. ఈ లింగ నిర్ధారిత వీర్యము వాడడం వలన 90% ఆడదూడలు మాత్రమే జన్మిస్తాయని తెలిపారు. దీనికిగాను రైతు వాటా 250...