25.7 C
Hyderabad

ఉచితంగా పశువులకు టీకాలు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో  గురువారం మోర్తాడ్ మండలంలోని డొంకల్ గ్రామంలో ఉచిత గాలికుంటూ నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించినట్లు పశువైద్య అధికారి గౌతమ్ రాజు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా  158 పశువులకు (ఆవులు, గేదెలు) ఉచిత గాలికుంటు టీకాలు చేయటం జరిగిందని ఆయన పేర్కొన్నారు.  కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వైద్యులు గంగాధరయ్య  సందర్శించారు.  కార్యక్రమంలో గ్రామస్తులు  టి.అనిల్, టి. అశోక్ రెడ్డి, ప్రదీప్, రాజేశ్వర్ రెడ్డి, మామిడి సురేష్ రెడ్డి   మరియు  పశుసంవర్ధక శాఖ సిబ్బంది ప్రభాకర్,  ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article