29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రెండో విడతలో 78 కేంద్రాలకు మీటర్ల ఏర్పాటు ప్రారంభం

 

బోధన్, బతుకమ్మ :

 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మొదటి విడతలో బోధన్ డివిజన్ పరిధిలో విద్యుత్ సౌకర్యం లేని 129 అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించగా, రెండో విడతలో మరో 78 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సరఫరా కల్పించేందుకు మీటర్ల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం రాష్ట్ర విద్యుత్ సంస్థ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు చేపడుతున్నట్లు ఏడీఈ (కన్స్ట్రక్షన్) నిజామాబాద్ తోట రాజశేఖర్ తెలిపారు. చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో విద్యుత్ సౌకర్యాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో వేసవి కాలంలో చిన్నారులు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ భవనాలతో పాటు రెంట్-ఫ్రీ భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఉచిత విద్యుత్ మీటర్లు, కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంఎస్సీ ఫారం అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో విద్యుత్ మీటర్ కనెక్షన్ ఏర్పాటు చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఎడపల్లి కిషోర్, అంగన్వాడీ టీచర్ సుప్రియతో పాటు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article