24 C
Hyderabad
Sunday, August 2, 2026

పంట తూకంలో మోసం

Must read

📰 Generate e-Paper Clip

  • దళారులపై, హామాలీలపై తిరగబడ్డ రైతులు

 

బతుకమ్మ, భిక్కనూరు: మొక్కజొన్న కొనుగోలులో మోసం చేసిన దళారులు హమాలీలపై రైతులు తిరగబడ్డ ఘటన కామరెడ్డి జిల్లాలో గురువారం కలకలం రేపింది తూకంలో దాదాపు 12 కిలోలు మోసం చేయడంతో పసిగట్టిన రైతులు వారిని నిలదీశారు. దీంతో  దళారులను పట్టుకొని గ్రామపంచాయతీ దగ్గరికి తీసుకువచ్చిన ఘటన భిక్కనూరు మండలం గుర్జకుంట  గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొంతమంది రైతులు మార్కెట్ ధర కన్నా తక్కువ అమ్ముకున్న కానీ  60 కిలోల బస్తాకు 72 కిలోల తూకం వేయడంతో పసిగట్టిన రైతులు గొడవకు దిగారు. రైతులందరూ దళారులను గ్రామపంచాయతీ దగ్గరికి తీసుకురావడంతో రైతులందరూ గుమ్మిగుడడంతో దళారులు తప్పు అయిందని ఒప్పుకోవడంతో రైతులు శాంతించారు. దళారులు మూడు రోజుల నుండి తూకం వేసిన దానికి రైతులకు మిగతా డబ్బులు ఇవ్వడంతో రైతులు దళారులను నమ్మి మోస పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Fraud in purchase of crops

More articles

Latest article