నిజామాబాద్ వైద్య కళాశాలలో నాలుగు పీజీ సీట్లు

0 15,500

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వైద్య కళాశాలలో నాలుగు పీజీ సీట్లు కొత్తగా  పెరిగాయని కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీడీయాట్రిక్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు పెంచారని, పాత మూడు సీట్లతో కలిసి ఇప్పుడు మొత్తం ఏడు పీజీ సీట్లు అయ్యాయన్నారు. డెర్మటాలజి విభాగంలో నాలుగు పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. పీజీ సీట్లు పెరుగడంతో మరింత సేవలు మెరుగవుతాయని వారు హర్షం వ్యక్తం చేశారు. దీంతో వైస్ ప్రిన్సిపాళ్లు డా.జలగం తిరుపతిరావు, డా.నాగమోహన్, డా.కిషోర్, హెచ్ వోడిలు, ఆఫీస్ సూపరింటెండెంట్ పెద్దోళ్ళ నాగరాజు సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు. వైద్య విద్యార్థులకు కూడా పీజీ సీట్లు స్థానికంగా లభిస్తాయని, రోగులకు వైద్య సేవలు మరింత మెరుగవాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.