25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ :  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 22,154 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి 12,500 గోదావరిలోకి విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ అధికారి రవి తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా 4000, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000 , సరస్వతి కాలువ ద్వారా 650 , లక్ష్మీ కాలువ ద్వారా 200 , మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1091.00 అడుగులు, 80.501 టీఎంసీల నీరు ఉంది.

More articles

Latest article