నందిపేట, బతుకమ్మ : నందిపేట మండలం తొండకూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దసగౌడ్ శనివారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌ను కలిసి, గ్రామ అభివృద్ధి కోసం రూ. 50 లక్షల నిధులు మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా దసగౌడ్ మాట్లాడుతూ, గ్రామంలో తాగునీరు, రహదారులు, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన గ్రామ ప్రజల ఆవసరాలు తీర్చేందుకు తన ప్రయత్నాలు నిరంతరంగా కొనసాగుతాయని చెప్పారు. మహేశ్ గౌడ్ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారని, నిధుల మంజూరుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని దసగౌడ్ పేర్కొన్నారు.
