30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ లో చేరిన మాజీ ప్రజాప్రతినిధులు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ: లింగంపేట మండలం బాయంపల్లికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో తాజా మాజీ సర్పంచ్ కండ్లపల్లి బాలయ్య, మాజీ ఎంపీటీసీ పచ్చింటి సాయిలు, చింతల సాయిలు, గుట్టమీద సాయిలు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత 20 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 16 నెలల్లో చేసి చూయించారని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ అధికారులే ప్రజల ఇళ్లకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు. అభివృద్ధికి ఆకర్షితులమై  ఎమ్మెల్యే మదన్ మోహన్ చేపడుతున్న అభివృద్ధిలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ లో చేరామని తెలిపారు. కార్యక్రమంలో లింగంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article