కాంగ్రెస్ లో చేరిన మాజీ ప్రజాప్రతినిధులు
ఎల్లారెడ్డి, బతుకమ్మ: లింగంపేట మండలం బాయంపల్లికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో తాజా మాజీ సర్పంచ్ కండ్లపల్లి బాలయ్య, మాజీ ఎంపీటీసీ పచ్చింటి సాయిలు, చింతల సాయిలు, గుట్టమీద సాయిలు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత 20 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 16 నెలల్లో చేసి చూయించారని...