28.2 C
Hyderabad

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి గంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి,పిసిసి జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధునీకరణ ఉదారీకరణంపై దృష్టి సాధించింది, కంప్యూటర్లు, టెలి కమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడని, రాజీవ్ గాంధీని భారత దేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, , బాగా రెడ్డి, నరసింహారెడ్డి ,అంజయ్య, యాదగిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.

More articles

Latest article