26.2 C
Hyderabad

అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని (గౌరారం)లింగాపూర్ గ్రామంలో మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి శుక్రవారం శ్రీ దుర్గామాతను దర్శించుకొని పూజలు నిర్వహించారు,గ్రామంలో పాడి పంటలతో పాటు రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం గ్రామంలో అమ్మవారిని 11 రోజులపాటు పూజలతో గ్రామమంతా భక్తిమయంలో పరవశించడం చాలా ఆనందంగా ఉంటుందన్నారు. శ్రీ దుర్గామాత తల్లి,అమ్మవారి దీవెనలు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు,ఈ కార్యక్రమంలో భక్తులు,గ్రామ ప్రజలు,మాలాధారణ వేసుకున్న స్వాములు,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article