మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్ కు సుదర్శన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివలింగు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఆకర్షితుడినై కాంగ్రెస్ లో చేరానని, బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ అడుగుజాడల్లో నడిచి, ఆయన చేస్తున్న సేవలలొ భాగస్వామినవుతూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
