27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మాజీ జడ్పీటీసిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : ఇటీవల అనారోగ్య కారణంగా పలు పలు సర్జరీలు చేసుకున్న బిఆర్ఎస్ నాయకురాలు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ మోరే సులోచన కిషన్ ను బిఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక అవకాశవాదని తమ రాజకీయ భవిష్యత్తు కోసం నమ్మిన కెసిఆర్ కు నమ్మకద్రోహం చేశారని ఆయన అన్నారు. గత బి ఆర్ ఎస్ హయాంలో  కేసీఆర్ బాన్సువాడ కు బంగారు వాడగా మార్చడాని ఆయన తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నావారు పోచారం అనుచరులననీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో  ఆయన వెంట మాజీ జడ్పీటీసీ మోరే సులోచన కిషన్, నియోజకవర్గ నాయకులు జుబేర్, సమీర్, సుదం నవీన్,నజీర్, మాజీ ఎంపీటీసీ ఫారూక్,గంగా ప్రసాద్ గౌడ్, విజయ్ పటేల్, శంకర్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Former MLA visits former ZPTC

More articles

Latest article