- ఎమ్మెల్సీ పోటీ నుంచి విరమణ
నిజామాబాద్, బతుకమ్మ : మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఎం. గంగాధర్ బుధవారం ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటించారు. ఇటీవల డిఎస్పీ పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సీనియర్ కాంగ్రెస్ నేత వి.హన్మంతరావుతో పాటు సెక్రటేరియట్ కు వచ్చిన గంగాధర్ కు మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధికార అభ్యర్థి డా. వి. నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాల్సిందిగా మంత్రి ఆయనకు సూచించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
