24.8 C
Hyderabad
Friday, July 31, 2026

వేల సంవత్సరాలు విద్యా, ఉపాధికి దూరంగా ఉన్నాం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంఆర్పీఎస్ సాంస్కృతిక సారథి జిల్లా ఇంచార్జీ మచ్చ దేవేందర్

 

నందిపేట్, బతుకమ్మ : వేల సంవత్సరాల పాటు విద్యా, ఉపాధికి దూరంగా ఉన్నామని ఎంఆర్పీఎస్ సాంస్కృతిక సారధి జిల్లా ఇంచార్జీ మచ్చ దేవేందర్ అన్నారు. ఎమ్మార్పీఎస్ సాంస్కృతిక రథసారథి యాత్ర ఆదివారం నందిపేట్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ రథయాత్రకు మండల ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సాంస్కృతిక జిల్లా ఇంచార్జీ మచ్చ దేవేంధర్ మాట్లాడారు. అంబేద్కర్ పుణ్యమాని మనుషులుగా బతుకుతున్నామని అన్నారు. 70 సంవత్సరాలుగా రాని ఉద్యోగాలు నాలుగు సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ అమలైతే అన్ని ఉద్యోగాలు వచ్చాయని అన్నారు.  వర్గీకరణ లేకపోవడం వల్ల ఎంతగానో నష్టపోయామని తెలిపారు. మాదిగ వాళ్ల కోసమే మందకృష్ణ ఈ ఉద్యమాన్ని నడపడం లేదని. ఇంకా 59 కులాలు బాగుకోసం ఉద్యమాన్ని నడుపుతున్నాడని తెలిపారు. 59 కులాల్లో మాల కులం మాత్రమే వ్యతిరేకిస్తుందని అన్నారు. భవిష్యత్ తరాల కోసం  లక్ష డప్పులు వేయి గొంతుకులను విజయవంతం చేయాలని కోరారు. ఫిబ్రవరి 7న పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ అంటే మాదిగళ్ల కోసం చేసిన ఉద్యమాలు కాదు అనేక పోరాటాలు చేసిన సంస్థ ఎంఆర్పిఎస్ అని తెలిపారు. మరో కాన్సిరాం లాగా వర్గీకరణ కోసం పోరాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికెళ్ల పోశెట్టి, కళాకారుడు చిట్టిబాబు, మాదిగ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు మారుతి మారుతి మాదిగ, మండల ఇంచార్జీ కలిగోట సంతోష్, ప్రసాద్, గంగానర్సయ్య పాల్గొన్నారు.

For thousands of years we are away from education and employment

More articles

Latest article