వేల సంవత్సరాలు విద్యా, ఉపాధికి దూరంగా ఉన్నాం
ఎంఆర్పీఎస్ సాంస్కృతిక సారథి జిల్లా ఇంచార్జీ మచ్చ దేవేందర్ నందిపేట్, బతుకమ్మ : వేల సంవత్సరాల పాటు విద్యా, ఉపాధికి దూరంగా ఉన్నామని ఎంఆర్పీఎస్ సాంస్కృతిక సారధి జిల్లా ఇంచార్జీ మచ్చ దేవేందర్ అన్నారు. ఎమ్మార్పీఎస్ సాంస్కృతిక రథసారథి యాత్ర ఆదివారం నందిపేట్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ రథయాత్రకు మండల ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సాంస్కృతిక జిల్లా ఇంచార్జీ మచ్చ దేవేంధర్ మాట్లాడారు. అంబేద్కర్ పుణ్యమాని మనుషులుగా బతుకుతున్నామని అన్నారు. 70 సంవత్సరాలుగా రాని...