నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలోని కోట గల్లీలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సఖి సతీష్ మాట్లాడుతూ.. చిన్నారులకు సొంత ఖర్చులతో గుండె ఆపరేషన్లు చేయిస్తూ మహేష్ బాబు అందిస్తున్న సేవా స్ఫూర్తితో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మహేష్ బాబు సేవా కార్యక్రమాల స్ఫూర్తితో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు జిల్లా కమిటీ నాయకులు భూపతి రిషికేష్, నగర కమిటీ నాయకులు పాశికంటి మహేష్, చంద్రశేఖర్, స్వర్గం రమేష్, సాధు సతీష్, సాధు వినోద్ తదితరులు పాల్గొన్నారు.
