27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వరద కాలువ పనులు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడు మండలం గాండ్లపేట గ్రామంలో వాగులోకి వెళ్లే వరద నీటి కాలువలో పేరుకుపోయిన మట్టి తొలగింపు పనులు మంగళవారం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. పది సంవత్సరాలుగా ప్రతి వర్షాకాలంలో తమ పొలాలు మునిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని దీంతో పనులు ప్రారంభించడంతో గ్రామ ప్రజలు జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గిర్మాజి గోపి, పుప్పాల అశోక్, గాండ్లపేట్ పట్టణ అధ్యక్షుడు సాయిరాం, సంజీవ్, అశోక్, గంగా ప్రసాద్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జయరాజ్, ఉపాధ్యక్షులు కాశన్న, గంగన్న, వెంకటేష్, సుభాష్, భూపతి, చిట్టి నరేష్, గుర్రం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Flood canal work begins

More articles

Latest article