హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో జరుగనున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ద్రువీకరణ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా విజయశాంతి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మరో ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు సరిగా దాఖలు చేయని కారణంగా అవి తిరస్కరించబడ్డాయి. దీంతో ఈ ఐదుగురు ఏకగ్రీవం అయ్యారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ కు నాలుగు స్థానాలు, వాటిలో ఒకటి పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది. ఫలితంగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపీఐ నుంచి సత్యం నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. వీరంగా ఏకగ్రీవం అయినట్లు ఈసీ ప్రకటించింది.
