ఈ నెలాఖరున స్థానిక ఎన్నికల నోటిఫికేషన్
మంత్రి పొంగులేటి
హైదరాబాద్, బతుకమ్మ : ఈనెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం క్యాబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీ పై స్పష్టత ఇస్తామని చెప్పారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని వివరించారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని, కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గెలిచే అవకాశాలున్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు
