రుద్రూర్, బతుకమ్మ: తొలి ఏకాదశిని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండే స్వామి వారికి ప్రత్యేక పూజలు, మంగళ హరతులు చేపట్టారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, ఆలయ కమిటీ నిర్వాహకులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
