27.3 C
Hyderabad
Friday, July 31, 2026

డంపింగ్ యార్డ్ లో అగ్నిప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బోధన్ : ఈనెల 19న అర్థరాత్రి సమయంలో బోధన్ డంపింగ్ యార్డ్‌లో  ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఇది ఒక సాధారణ అగ్నిప్రమాదం మాత్రమేనా? లేక కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగాన్ని దాచేందుకు రాచబండపై ముసుగు వేయాలనే కుట్రనా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవ‌ల హైదరాబాద్ సిడిఎంఏ ఆఫీస్ నుండి బోధన్ మున్సిపాలిటీకి రూ.70 లక్షల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులు బయో మైనింగ్ ప్రాజెక్ట్ కోసం అనుమతించబడినవి. తగిన విధంగా చెత్తను వేరు చేసి పునర్వినియోగపరచాల్సిన ప్రక్రియకు ఇది వినియోగించాల్సి ఉంది. అయితే, వ్యవస్థల లొలకంగా, ఏఈ లేదా సీనియర్ ఇన్‌స్పెక్టర్ లేకుండానే బిల్లులు కాంట్రాక్టర్ సూపర్వైజర్ సంతకాలపై ఆమోదించబడ్డాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెక్నికల్ పరిశీలనలో, డంపింగ్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిసిటీ మీటర్ వినియోగాన్ని పరిశీలిస్తే అసలు ఎంత చెత్తను ప్రాసెస్ చేశారు అన్నది స్పష్టమవుతుంది. ఏప్రిల్ 4న పౌరులు ఆర్.టి.ఐ దాఖలు చేసి — నిధుల రాక, వినియోగం, రిజిస్టర్లు, బిల్లింగ్ వివరాలపై ప్రశ్నలు వేశారు. చట్ట ప్రకారం 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలి. కానీ ఆ సమయానికే ఏప్రిల్ 19న మంటలు అంటుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. కమిషనర్ స్పందనలో, ఔషధాల లేదా కెమికల్ బాటిళ్ల వలన గ్యాస్ ఉత్పత్తి కావడం వల్లే మంటల ఘటన జరిగి ఉండవచ్చని తెలిపారు. కానీ ప్రజల అభిప్రాయం ప్రకారం, మీటర్ రీడింగులు, యంత్రాల స్థితి, బిల్లుల కాపీలు పరిశీలిస్తే అసలు నిజం బయటపడుతుంది. బాధ్యులను శిక్షించకపోతే, ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం తగ్గిపోవడం తథ్యం. అంతేకాక ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ ప్రతిష్ట కూడా ప్రమాదంలో పడే అవకాశముంది.

Fire in dumping yard

More articles

Latest article