డంపింగ్ యార్డ్ లో అగ్నిప్రమాదం

బతుకమ్మ బోధన్ : ఈనెల 19న అర్థరాత్రి సమయంలో బోధన్ డంపింగ్ యార్డ్‌లో  ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఇది ఒక సాధారణ అగ్నిప్రమాదం మాత్రమేనా? లేక కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగాన్ని దాచేందుకు రాచబండపై ముసుగు వేయాలనే కుట్రనా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవ‌ల హైదరాబాద్ సిడిఎంఏ ఆఫీస్ నుండి బోధన్ మున్సిపాలిటీకి రూ.70 లక్షల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులు బయో మైనింగ్ ప్రాజెక్ట్ కోసం అనుమతించబడినవి. తగిన విధంగా చెత్తను వేరు చేసి పునర్వినియోగపరచాల్సిన ప్రక్రియకు ఇది వినియోగించాల్సి ఉంది....