29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్లపై కేజీ వీల్స్ తో ట్రాక్టర్ నడిపితే జరిమానా

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్  గ్రామంలో రోడ్లపై కేజీ విల్ ఉన్న ట్రాక్టర్లు నడిపితే వీడిసి ఆధ్వర్యంలో జరిమానా విధిస్తామని వీడిసి అధ్యక్షులు సిద్ధరాములు అన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్ రెడ్డి మాట్లాడుతూ వీడిసి ఆధ్వర్యంలో ట్రాక్టర్ యాజమానులను పిలిపించి రోడ్లపై కే జీ విల్ ట్రాక్టర్లు నడపవద్దని తీర్మానం చేసి 25 వేల రూపాయలు జరిమాన విధిస్తామన్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు వేయిస్తే ట్రాక్టర్ నడిపేవారు కేజీ వీలు ఉపయోగించి ధ్వంసం చేయడం సరికాదన్నారు నిబంధనలు ఉల్లంఘించి నడిపిస్తే వీడిసికి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో లింగారెడ్డి ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్ లు ఉన్నారు.

More articles

Latest article