29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నిరుపేద అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నవీపేట్ : మండలంలోని నందిగాం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ ఇందిర అనారోగ్యంతో శనివారం రాత్రి మరణించడం తో వారి కుటుంబానికి ద్యావాడె మాణిక్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆద్వర్యంలో ద్యావాడే సంజీవ్ ఐదువేల రూపాయల ఆర్థిక‌ సాయం అందించారు. ఈసందర్భంగా డి.సంజీవ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేద కుటుంబానికి ఇంటిస్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, సి.యం.ఆర్.ఎఫ్ ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జన చైతన్య వేదిక నాయకులు రాజశేఖర్, గ్రామస్థులు భూంరావు సాయన్న తదితరులు పాల్గొన్నారు..

More articles

Latest article