భీమ్ గల్, బతుకమ్మ : ఓ నిరుపేద యువకుడు మరణించగా భీమ్ గల్ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం అందించారు. గతంలో సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి అంత్యక్రియల కుడా ఖర్చు చేసేస్తోమత లేని నిరుపేదలకు అంత్యక్రియలకు సర్వ సమాజ్ అండగా నిలుస్తుందని చెప్పిన మాట విధితమే కాగా అందులో భాగంగానే భీమ్ గల్ కు చెందిన ఓ నిరుపేద యువకుడు కిండుకు రఘు (28) అనారోగ్యంతో మరణించగా ఆయన అంత్యక్రియలకు రూ. 5000 లు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతే కాకుండా సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలను నిర్వహించడానికి కావాల్సినవి అన్ని మౌళి సదుపాయాలను సర్వ సమాజ్ దగ్గరుండి ఏర్పాటు చేసి మృతుని కుటుంబానికి అండగా నిలిచారు.
