- బైక్ ను ఢీకొట్టి లారీ బోల్తా
- ఇద్దరు యువకుల దుర్మరణం

జక్రాన్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జక్రాన్ పల్లి మండలం వివేక్ నగర్ తాండ సమీపంలో శుక్రవారం సాయంత్రం బైక్ ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో లారీ అతివేగంగా ఉండడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో వివేక్ నగర్ తాండకు చెందిన భానోత్ శ్రీను, కేశ్ పల్లి తాండకు చెందిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్, క్లీనర్లు కూడా గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జక్రాన్ ప్లలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

